ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి.. టీఆర్ఎస్ స్పందన

TRS response on Renuka Chowdary holding SI collar
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. హైదరాబాద్ లో కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా కొనసాగింది.

ఈ సందర్భంగా తనను అడ్డుకోబోయిన పోలీసులపై కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మండిపడ్డారు. పంజాగుట్ట ఎస్సై షర్ట్ కాలర్ ను ఆమె పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అక్కడి నుంచి పోలీసు వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు రేణుక వార్నింగ్ ఇచ్చారు. మీ స్టేషన్ కు వచ్చి మిమ్మల్ని కొడతానంటూ హెచ్చరించారు.  

ఈ నేపథ్యంలో రేణుకా చౌదరిపై టీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పించింది. బీజేపీతో కొట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ ఆస్తులను నాశనం చేస్తున్నారని, పోలీసులపై దాడికి పాల్పడుతున్నారని విమర్శించింది. ఇలాంటి రౌడీలను అరెస్ట్ చేయాలని, వారు చేసిన డ్యామేజీకి వారి నుంచి పరిహారం వసూలు చేయాలని పేర్కొంది. కాంగ్రెస్ నేతలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టింది. పోలీసులను తిట్టడం, కొట్టడం వంటివి తెలంగాణ కాంగ్రెస్ నేతల మనస్తత్వాన్ని చూపెడుతున్నాయని వ్యాఖ్యానించింది.
Go Back to Shorts
Renuka Chowdary
Congress
Police
SI

More Telugu News