Sujana Chowdary: న‌డ్దాతో సుజ‌నా భేటీ... ఏపీ ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన‌ బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి బుధ‌వారం ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జ‌గ‌త్ ప్ర‌కాశ్ న‌డ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రాజ‌కీయ ప‌రిస్థితులు, ఇత‌ర‌త్రా అభివృద్ధి ప‌నుల‌పై ఆయ‌న న‌డ్డాతో చ‌ర్చించారు. రాష్ట్రంలో బీజేపీ పురోగ‌మ‌నానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌ను కూడా ఈ సంద‌ర్భంగా న‌డ్డాకు సుజ‌నా వివ‌రించారు.

ఈ భేటీలో భాగంగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జేపీ న‌డ్డాను కోరినట్టు సుజ‌నా చౌద‌రి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అదే విధంగా అమ‌రావ‌తి నిర్మాణం, రైల్వే జోన్ ప‌నుల‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం వేగ‌వంతం చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కూడా కోరినట్టు పేర్కొన్నారు. 
Sujana Chowdary
JP Nadda
Andhra Pradesh
BJP
Polavaram Project
Amaravati
Railway Zone

More Telugu News