టీఆర్ఎస్ కీలక నిర్ణయం.. నేటి మమతా బెనర్జీ సమావేశానికి దూరం
- కాంగ్రెస్‌ను ఆహ్వానించడంపై టీఆర్ఎస్ కినుక
- పార్టీ నేతలతో చర్చించిన అనంతరం దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్న కేసీఆర్
- రాష్ట్రపతి ఎన్నికల్లో తమ వైఖరిని తర్వాత ప్రకటిస్తామన్న టీఆర్ఎస్
మరోవైపు, ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి సహా 8 మంది సీఎంలు, 22 మంది వివిధ పార్టీల నేతలకు మమత లేఖలు రాశారు. అయితే, కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తే తాము వచ్చేది లేదని ఇటీవలే తేల్చి చెప్పిన టీఆర్ఎస్.. అనుకున్నట్టే ఈ సమావేశానికి డుమ్మా కొడుతోంది. సమాశానికి హాజరు కావాలా? వద్దా? అన్న విషయమై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. చివరికి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు తాము సమదూరం పాటిస్తామని, తమ వైఖరేంటో తర్వాత ప్రకటిస్తామని టీఆర్ఎస్ తెలిపింది.