Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో అత్యుత్తమ రెస్టారెంటుగా 'చాయ్ పానీ'

Chai Pani grabs Americas best restaurant award
  • జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమం
  • భారత సంతతి వ్యక్తుల రెస్టారెంట్ కు అగ్రస్థానం
  • చాయ్ పానీలో తయారు చేసే చాట్ చాలా ఫేమస్
భారతీయ చిరుతిండ్లకు ప్రసిద్ధికెక్కిన చాయ్ పానీ రెస్టారెంట్ అమెరికాలో అత్యుత్తమ రెస్టారెంట్ గా నిలిచింది. జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ నామినేషన్లలో చాయ్ పానీ రెస్టారెంట్ కు అగ్రస్థానం లభించింది. ఈ రెస్టారెంట్ నార్త్ కరోలినాలోని ఆష్ విల్లే ప్రాంతంలో ఉంది. షికాగోలో సోమవారం బెస్ట్ ఈటరీ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. న్యూ ఆర్లియెన్స్ కు చెందిన బ్రెన్నన్స్ వంటి ప్రముఖ రెస్టారెంట్ ను సైతం చాయ్ పానీ వెనక్కి నెట్టడం విశేషం. 

కాగా, గతంలో ఈ అవార్డును న్యూయార్క్ లేదా షికాగోలోని రెస్టారెంట్లే చేజిక్కించుకునేవి. తొలిసారి భారత వంటకాలకు పేరొందిన రెస్టారెంట్ అమెరికాలో నంబర్ వన్ గా నిలిచింది. చాయ్ పానీ రెస్టారెంట్ ఇండియన్ స్నాక్స్ కు చాలా ఫేమస్. ఇక్కడ తయారుచేసే చాట్ తినేందుకు అమెరికన్లు పడిచస్తుంటారు. చాయ్ పానీ భిన్న రకాల రుచుల్లో పసందైన చాట్లను, ఇతర వంటకాలను వేడివేడిగా అందిస్తుంటుంది.
Chai Pani
Best Restaurant
Award
James Beard Foundation
USA

More Telugu News