సేవ్ చేసుకోకుండానే... కొత్త నంబర్ కు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు!
- ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేయాలి
- అక్కడ కింద చెప్పినట్టు టైప్ చేస్తే చాలు
- మెస్సేజ్ ఆప్షన్ తో వాట్సాప్ తెరుచుకుంటుంది
ముందు మీ ఫోన్ లో ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయండి. బ్రౌజర్ సెర్చ్ బార్ లేదా యూఆర్ఎల్ బార్ లో https://wa.me/91 అని టైప్ చేసి స్పేస్ ఇవ్వకుండా ఫోన్ నంబర్ యాడ్ చేసి సెర్చ్ ఓకే చేయండి. వెంటనే వాట్సాప్ యాప్ ఓపెన్ అయ్యి సదరు ఫోన్ నంబర్ తో మెస్సేజ్ ఆప్షన్ తెరుచుకుంటుంది. అప్పుడు ఆ నంబర్ కు వాట్సాప్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 9393939393 నంబర్ కు వాట్సాప్ చేయాలని అనుకుంటే.. https://wa.me/919393939393 అని టైప్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది.