ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

Sonia admits Gagaram hospital in Delhi
  • జూన్ 2న సోనియాకు కరోనా పాజిటివ్
  • ఈడీ విచారణకు గైర్హాజరు
  • ఇంటివద్దే ఐసోలేషన్
  • కరోనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వైనం
ఇటీవలే కరోనా బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. జూన్ 2న సోనియాకు కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆమె ఇంటికే పరిమితమయ్యారు. అయితే, కరోనా సంబంధిత సమస్యలతో ఆమె నేడు ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 

ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యులు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నందున ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. సోనియా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సందేశాలు పంపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.
Go Back to Shorts
Sonia Gandhi
Gangaram Hospital
Corona Virus
Congress
New Delhi

More Telugu News