ఉత్సాహం కోసం ఈ వీడియో చూడండి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

  • తమిళనాడులోని ఓ ఆలయం ఏనుగు పుట్టిన రోజు వేడుక
  • వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన మహీంద్రా
  • తలాండించే విధానం బాగుందంటూ ట్వీట్
ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీని విశేషాలకు వేదికగా మలిచేసుకున్నారు. తన కంట పడిన విశేషాలను తన ఫాలోవర్లతో పంచుకోవడం ఆయనకు ఒక హాబీ. తాజాగా తమిళనాడులోని ఓ ఆలయానికి సంబంధించిన ఏనుగు పుట్టిన రోజు విశేషాలను ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు తోడు ఆయన పోస్ట్ చేసిన వీడియో చూడ్డానికి సరదాగా అనిపిస్తోంది. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ఈ నెల 10న సాయంత్రం పోస్ట్ చేశారు. ఇప్పటికే 7 లక్షల మంది దీన్ని చూశారు. 

‘‘ఈ క్లిప్ తమిళనాడులోని తిరువానైకవల్ ఆలయానికి సంబంధించి అఖిల అనే ఏనుగు పుట్టిన రోజు సంబరాలది. ఏనుగు దేశీ రూపం, తల ఆడించే విధానం నాకు ఎంతో నచ్చింది. పైగా అది ఆనందించే తీరు ఇతరులనూ ఆకట్టుకునేలా ఉంది. తమను తాము సంతోషపరుచుకోవాలని భావించే వారికి ఇదొక మంచి క్లిప్’’అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఏనుగు తనకు ప్రసాదంగా పెట్టిన వివిధ రకాల పండ్లను రుచిచూస్తూ సంతోషంగా తలాడించడం నిజంగా  ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 


Anand Mahindra
shares video
elephant
birthday

More Telugu News