'భోళా శంకర్' సెట్స్ పైకి మెగాస్టార్!
- 'భోళా శంకర్' గా చిరంజీవి
- 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్
- కథానాయికగా మెరవనున్న తమన్నా
- మెగాస్టార్ కి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్
'వేదాళం' సినిమాకి రీమేక్ గా రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'భోళా శంకర్'కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఆ మధ్య చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను ఈ నెల 21వ తేదీ నుంచి ప్లాన్ చేశారు. ఆ రోజు నుంచి చిరంజీవి తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం జరుగుతూ ఉండటంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడం కోసం మేకర్స్ ఈ ప్రకటన చేశారు. చిరంజీవి సరసన నాయికగా తమన్నా కనువిందు చేయనుండగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.