చంద్రబాబు, దేవినేని కేసులు పెడితే భయపడిపోతానా?: అంబటి రాంబాబు
- ఫేక్ ట్వీట్ల వ్యవహారంలో అంబటిపై సీఐడీకి ఫిర్యాదు చేసిన దేవినేని ఉమ
- కేసులు పెట్టుకునే స్వేచ్ఛ వారికి ఉందన్న అంబటి
- కావాలంటే అంతర్జాతీయ న్యాయస్థానానికీ వెళ్లొచ్చంటూ వ్యంగ్య వ్యాఖ్యలు
ఫేక్ ట్వీట్‌ను తనకు ట్యాగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారంటూ అంబటిపై దేవినేని ఉమ సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన ట్విట్టర్ ఖాతాను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం చేశారని ఆ ఫిర్యాదులో ఉమ ఆరోపించారు. ఉమ ఫిర్యాదుపై స్పందించిన అంబటి.. కావాలంటే చంద్రబాబు, ఉమ తనపై అంతర్జాతీయ న్యాయస్థానానికీ వెళ్లొచ్చంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.