రాహుల్ గాంధీ, బండి సంజయ్ లపై కేటీఆర్ విమర్శలు
- రాహుల్ కు పబ్ ల గురించి తప్ప వడ్ల గురించి ఏం తెలుసన్న కేటీఆర్
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్ప బండి సంజయ్ చేసేదేముందని ప్రశ్న
- బండి సంజయ్ విచిత్రమైన వ్యక్తి అన్న కేటీఆర్
ఇక మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తప్ప బండి సంజయ్ చేసేది ఏముందని మండిపడ్డారు. జన్ ధన్ ఖాతాల్లో నగదు వేస్తామన్నారని... ఇప్పటి వరకు వేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేముందని అడిగారు. మసీదులు తవ్వాలని బండి సంజయ్ అంటాడని... ఆయనకు సిగ్గూశరం ఉందా? అని ప్రశ్నించారు. ఆయన చాలా విచిత్రమైన వ్యక్తి అని అన్నారు.