TDP: ఈ నెల 20 నుంచి టీడీపీ రైతు పోరుబాట‌... క‌డ‌ప‌లో తొలి స‌భ

tdp tostart raitu poru bata from 20th of this month
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ స‌ర్కారు ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు అవలంబిస్తోంద‌ని ఆరోపిస్తున్న విప‌క్ష టీడీపీ వ‌రుస‌బెట్టి నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి రైతు పోరుబాట పేరిట బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. మొత్తంగా 5 పార్ల‌మెంటు నియోజ‌కవ‌ర్గాల ప‌రిధిలో ఈ బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించాల‌ని పార్టీ తీర్మానించింది. 

తొలి సభ‌ను ఈ నెల 20న క‌డ‌ప పార్ల‌మెంటు ప‌రిధిలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీడీపీ ప్ర‌క‌టించింది. ఈ నెల 25న నెల్లూరు, జులై 1న కాకినాడ‌, 7న విజ‌య‌న‌గ‌రం,13న విజ‌య‌వాడ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో రైతు పోరుబాట బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీడీపీ వెల్ల‌డించింది. ఈ స‌భ‌ల్లో 7 ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై రైతుల‌ను చైత‌న్య‌వంతం చేసేలా టీడీపీ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింది. వ్య‌వ‌సాయ మోటార్ల‌కు మీట‌ర్లు.. రైతుల పాలిట ఉరితాళ్లు అనే అంశంపై ఈ స‌భ‌ల్లో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించ‌నున్న‌ట్లు ఆ పార్టీ వెల్ల‌డించింది.
Go Back to Shorts
TDP
Raitu Poru Bata
kadapa
Vijayawada

More Telugu News