జేబీఎస్‌కు వెళ్లకుండా బండి సంజయ్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

Police House Arrest bandi sanjay
  • ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేబీఎస్‌ వద్ద నిరసనకు పిలుపు
  • బంజారాహిల్స్‌లోని సంజయ్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
  • నిరసన చేపట్టి తీరుతామన్న బీజేపీ నేతలు
ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌లోని జేబీఎస్ వద్ద నిరసనకు పిలుపునిచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సంజయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు.

విషయం తెలిసిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సంజయ్‌ను హౌస్ అరెస్ట్ చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జేబీఎస్ వద్ద నిరసన తెలిపి తీరుతామని తేల్చి చెబుతున్నారు.
Go Back to Shorts
BJP
Telangana
Bandi Sanjay
TSRTC

More Telugu News