TDP: 175 స్థానాల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాల‌యానికి తాళం వేస్తాం: అచ్చెన్నాయుడు

tdp ap chief atchennaidu challenge to ysrcp
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో అధికార వైసీపీకి విపక్ష టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు గురువారం ఓ స‌వాల్ విసిరారు. సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెబుతున్న‌ట్లుగా 175 స్థానాల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాల‌యానికి తాళాలు వేస్తామ‌ని ఆయ‌న ప్రకటించారు. మ‌రి 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంద‌ని జ‌గ‌న్‌కు న‌మ్మ‌కం ఉందా? అని అచ్చెన్న ప్ర‌శ్నించారు. అదే న‌మ్మ‌కం ఉన్న‌ట్టయితే జ‌గ‌న్ ఇప్పుడే ఎన్నికల‌కు వెళ్లాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. త‌క్ష‌ణ‌మే గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

అయినా ఏం చేశార‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు వైసీపీని 175 స్థానాల్లో గెలిపిస్తార‌ని అచ్చెన్న ప్ర‌శ్నించారు. ప్రజలు మ‌రోమారు జ‌గ‌న్‌కు ఓట్లేసేంత అమాయ‌కులు కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. టెన్త్ రిజ‌ల్ట్స్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ త‌ప్పుల కార‌ణంగా మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్న విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల్లో భ‌రోసా నింపేందుకు నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వ‌హిస్తే వైసీపీ నేత‌లు అందులోకి దొంగ‌ల్లా ప్ర‌వేశించార‌ని అచ్చెన్న మండిప‌డ్డారు. పిల్ల‌ల‌ను భ‌య‌పెట్టి జూమ్ కాన్ఫ‌రెన్స్‌లోకి చొర‌బ‌డ్డ వైసీపీ నేత‌ల‌పై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.
Go Back to Shorts
TDP
Atchannaidu
Andhra Pradesh
YSRCP
Nara Lokesh
YS Jagan

More Telugu News