తనను తానే పెళ్లాడాలనుకున్న అమ్మాయికి మరో కష్టం... వెనుకంజ వేసిన పురోహితుడు
- సోలోగమీ ప్రకటన చేసిన క్షమా బిందు
- తనను తానే పెళ్లాడతానని వెల్లడి
- ఆలయంలో పెళ్లికి అంగీకరించని పాలకమండలి
- పెళ్లి తంతు జరిపించలేనన్న పురోహితుడు
తాజాగా, క్షమా బిందుకు మరో కష్టం వచ్చిపడింది. ఇంటివద్దనైనా పెళ్లి చేసుకోవాలని భావించిన అమ్మడికి పురోహితుడు కూడా హ్యాండిచ్చేశాడు. ఈ పెళ్లి తంతు తాను జరిపించలేనని ఆయన తప్పుకున్నాడు. దీనిపై క్షమా బిందు ఓ వీడియోలో మాట్లాడుతూ, పురోహితుడు కూడా వెనక్కి తగ్గాడని, తన పెళ్లికి వేదిక కూడా లేకుండా పోయిందని వెల్లడించింది.
ఆన్ లైన్ లో చూసి పెళ్లి మంత్రాలు చదువుతూ తన పెళ్లి తానే జరిపించుకుంటానని పేర్కొంది. అంతేకాదు, తన పెళ్లిని రిజిస్టర్ చేయించుకుంటానని చెబుతోంది.
కాగా, సోలోగమీ ప్రకటన చేసినప్పటి నుంచి క్షమా బిందు ఫ్లాట్ కు మీడియా ప్రతినిధుల తాకిడి పెరిగింది. దాంతో ఆమె నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోని వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, తన ఇంటికి మీడియా దూరంగా ఉండాలంటూ క్షమా బిందు ఓ బోర్డు తగిలించింది.