అప్పటివరకు తిట్టిన నాయకులు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో గమనించాలి: పవన్ కల్యాణ్
- ఆసక్తికర ట్వీట్లు చేసిన పవన్
- పొగిడే నేతలను చూసి పడిపోవద్దని హితవు
- అలాంటి నేతలు మారినట్టు భావించరాదని వెల్లడి
- అలా భావిస్తే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్టేనని స్పష్టీకరణ
అప్పటివరకు తిట్టిన నాయకులు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ఆలోచించాలని పిలుపునిచ్చారు. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి... అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తించండి... జర భద్రం! అంటూ పవన్ ట్వీట్ చేశారు.