Al Qaeda: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల పట్ల అల్ ఖైదా ఆగ్రహం... భారత్ లో ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరిక

Al Qaeda releases a letter in reply to comments on prophet
  • టీవీ చానల్లో వ్యాఖ్యలు చేసిన నుపుర్
  • ట్విట్టర్ లో అదే తరహాలో వ్యాఖ్యానించిన నవీన్ జిందాల్
  • భారత్ లోనూ, అంతర్జాతీయంగానూ దుమారం
  • లేఖ విడుదల చేసిన అల్ ఖైదా
నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ఓ టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు భారత్ లోనే కాదు, అంతర్జాతీయంగానూ ప్రకంపనలకు కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను ఇస్లామిక్ దేశాలు ఇప్పటికే ఖండించగా, తాజాగా అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కూడా స్పందించింది. ఢిల్లీ, ముంబయి, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ఆత్మాహుతి దాడులు చేపడతామని హెచ్చరించింది. మహ్మద్ ప్రవక్త గౌరవాన్ని కాపాడడం కోసమే ఈ దాడులు అని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్ ఖైదా ఓ లేఖ విడుదల చేసింది. 

"మా ప్రవక్తను కించపరిచిన వారిని చంపేస్తాం. మా శరీరాలకు, మా పిల్లల దేహాలకు పేలుడు పదార్థాలు అమర్చుకుని మహ్మద్ ప్రవక్త అంటే ఏమాత్రం గౌరవంలేనివారిని పేల్చిపారేస్తాం. కాషాయ ఉగ్రవాదులు ఇక మృత్యువు కోసం ఎదురుచూడాలి" అంటూ లేఖలో పేర్కొన్నారు.
Al Qaeda
Letter
Suicide Attacks
Prophet

More Telugu News