YSRCP: ఎమ్మెల్సీ అనంత‌బాబు బెయిల్‌పై విచార‌ణ వాయిదా

hearing on mlc anantha babu bail petition adjourned to 9th of this month
షార్ట్స్‌లో చూడండి
త‌న వ‌ద్ద డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన సుబ్ర‌హ్మ‌ణ్యంను హ‌త్య చేసిన కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంత‌బాబు త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టులో ఇప్ప‌టికే బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో అనంత‌బాబు రిమాండ్ ముగుస్తున్న నేప‌థ్యంలో సోమ‌వారం పోలీసులు ఆయ‌న‌ను రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా... ఈ నెల 20 వ‌ర‌కు ఆయ‌న రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా అనంత‌బాబు దాఖ‌లు చేసుకున్న బెయిల్ పిటిష‌న్ మంగ‌ళ‌వారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టులోనే విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌మూర్తి త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 9 (గురువారం)కి వాయిదా వేశారు. గురువారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి బెయిల్ పిటిష‌న్‌పై అనంత‌బాబు వాద‌న‌ల‌తో పాటు పోలీసుల త‌రఫు వాద‌న‌ల‌ను వినే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.
Go Back to Shorts
YSRCP
MLC Anantha Babu
Murder Case

More Telugu News