Nupur Sharma: నుపుర్ శర్మకు భద్రత పెంపు

Nupur Sharma Security Fortified
  • హత్య బెదిరింపుల నేపథ్యంలో అధికారుల నిర్ణయం
  • ఆమె కుటుంబం మొత్తానికీ రక్షణ
  • మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమెకు బెదిరింపులు
బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ, ఆమె కుటుంబానికి ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు పెరిగిపోయాయి. రేప్ చేసి చంపేస్తామంటూ కొందరు వ్యక్తులు ఆమెను బెదిరించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆమెకు భద్రతను కల్పిస్తున్నట్టు పోలీసు అధికారులు ప్రకటించారు. 

కాగా, నుపుర్ శర్మతో పాటు బీజేపీ మరో బహిష్కృత నేత నవీన్ జిందాల్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై కాన్పూర్ లో అల్లర్లూ చెలరేగాయి. దీంతో బీజేపీ వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇటు పలు ఇస్లాం దేశాల నుంచి ఆ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తమైంది.
Nupur Sharma
BJP
Prophet
Securtiy

More Telugu News