Andhra Pradesh: రేప‌టి నుంచే ఏపీలో ఉద్యోగుల బ‌దిలీలు... గైడ్‌ లైన్స్ జారీ చేసిన ప్ర‌భుత్వం

employees transfers in andhra pradesh from tomorrow
  • ఉద్యోగుల బ‌దిలీల‌పై సోమ‌వార‌మే జ‌గ‌న్ సంత‌కం
  • ఆ మ‌రునాడే ప్ర‌భుత్వం నుంచి ఉత్త‌ర్వుల జారీ
  • రేప‌టి నుంచి 17 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న బ‌దిలీలు
ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగుల సాధార‌ణ బ‌దిలీల‌కు రంగం సిద్ధ‌మైంది. బుధవారం (జూన్ 8) నుంచి ఈ నెల 17 వ‌ర‌కు ఉద్యోగుల బ‌దిలీలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉద్యోగుల బ‌దిలీల‌కు సంబంధించిన గైడ్ లైన్స్‌ను ప్రభుత్వం విడుద‌ల చేసింది. 

ఉద్యోగుల సాధార‌ణ బ‌దిలీల‌కు సంబంధించిన ఫైల్‌పై సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోమ‌వార‌మే సంత‌కం చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సంద‌ర్భంగా ఈ నెల 17లోగా ఉద్యోగుల బ‌దిలీలు పూర్తి అయ్యేలా చూడాలంటూ జ‌గ‌న్ సూచించారు. బ‌దిలీల్లో ఎలాంటి వివాదాలు రాకుండా చూడాలని కూడా జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు. సీఎం సూచ‌న‌ల‌కు అనుగుణంగానే తాజాగా మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.
Andhra Pradesh
Employees Transfers
YSRCP
YS Jagan

More Telugu News