Banarjee: చిరంజీవి చాలా మంచి వ్యక్తి... ఆయన చేసే సేవలు కొన్ని మాత్రమే తెలుస్తున్నాయి: నటుడు బెనర్జీ

Actor Banarjee talks about Chiranjeevi
  • 'చెప్పాలని ఉంది' కార్యక్రమానికి విచ్చేసిన బెనర్జీ
  • చిరంజీవి బయోపిక్ నిర్మిస్తారన్న ప్రచారంపై వివరణ
  • యూట్యూబ్ లో ఇష్టంవచ్చినట్టు రాస్తారని వెల్లడి
టాలీవుడ్ సీనియర్ నటుడు బెనర్జీ ఈటీవీలో ప్రసారమయ్యే 'చెప్పాలని ఉంది' కార్యక్రమంలో ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. తాను చిరంజీవి బయోపిక్ తీస్తానంటూ జరుగుతున్న ప్రచారం వట్టిదేనని అన్నారు. యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారని తెలిపారు. చిరంజీవి కష్టాలు, బాధలు, అవమానాలు, ఆయన ఘనతలను సినిమాగా తీస్తే బాగుంటుందని మాత్రమే అన్నానని స్పష్టం చేశారు. చిరంజీవి ఎంతో మంచి మనిషి అని కొనియాడారు. 

చిరంజీవి చేసే సేవా కార్యక్రమాలు కొన్ని మాత్రమే బయటికి తెలుస్తున్నాయని, చాలా సేవలు ఇంకా ఎవరికీ తెలియవని బెనర్జీ అభిప్రాయపడ్డారు. సినీ రంగంలోని 24 క్రాఫ్ట్స్ ల వారికే కాకుండా, బయటి వాళ్లకు కూడా కరోనా సంక్షోభం సమయంలో చేయూతగా నిలిచారని వెల్లడించారు. తనను ఎవరైనా దూషించినా చిరంజీవి పట్టించుకోరని, నటుడిగా ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలని పేర్కొన్నారు.
Banarjee
Chiranjeevi
Biopic
Tollywood

More Telugu News