Attaullah: ఇమ్రాన్ ఖాన్ కు ఏమైనా జరిగితే ఆత్మాహుతి దాడులే: హెచ్చరించిన ఎంపీ అతావుల్లా

ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ఇమ్రాన్ ఖాన్ తనపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందని పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన ఎంపీ అతావుల్లా తీవ్రస్థాయిలో స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ కు ఏమైనా జరిగితే ఆత్మాహుతి దాడులు జరుగుతాయని హెచ్చరించారు. అతావుల్లా... ఇమ్రాన్ ఖాన్ విధేయుడిగా పేరుగాంచారు. 

ఈ నేపథ్యంలో, పాక్ లో ఇటీవల కొలువుదీరిన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అతావుల్లా స్పందించారు. ఇమ్రాన్ తలపై ఒక్క వెంట్రుకకు హాని జరిగినా ప్రస్తుత ప్రభుత్వ పాలకులు గానీ, వారి వారసులు గానీ ఈ భూమ్మీద మిగలరు అని స్పష్టం చేశారు. తానే మొదటి ఆత్మాహుతి దాడి చేస్తానని అన్నారు. తన వెనుక వేలాది మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అతావుల్లా కరాచీ నుంచి చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Attaullah
Suicide Attacks
Imran Khan
PTI
Pakistan

More Telugu News