పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపినట్టే నిన్నూ చంపేస్తాం: సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ
- ఇటీవల పంజాబీ సింగర్ హత్య
- సల్మాన్, సలీమ్ ఖాన్ లను కూడా చంపేస్తామని లేఖ
- ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసిన సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ గతంలో కృష్ణజింకలను వధించినట్టు ఆరోపణలు ఎదుర్కోవడం తెలిసిందే. సల్మాన్ పై నాడు బిష్ణోయ్ తెగవారు కోర్టును ఆశ్రయించారు. కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఇప్పుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ కూడా ఈ బిష్ణోయ్ తెగకు చెందినవాడే. ఇతడు గతంలోనే సల్మాన్ ను చంపేస్తానంటూ బహిరంగంగా ప్రతిజ్ఞ చేశాడు. ఈ నేపథ్యంలో, సల్మాన్ కు తాజాగా బెదిరింపు లేఖ వెనుక లారెన్స్ ముఠా హస్తం ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.