పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపినట్టే నిన్నూ చంపేస్తాం: సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను చంపినట్టే నిన్నూ చంపేస్తాం: సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ

Threat to Salman Khan and his father
  • ఇటీవల పంజాబీ సింగర్ హత్య
  • సల్మాన్, సలీమ్ ఖాన్ లను కూడా చంపేస్తామని లేఖ
  • ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేసిన సల్మాన్ ఖాన్
ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను కొందరు దుండగులు కాల్చి చంపడం తెలిసిందే. అయితే, సిద్ధూ మూసేవాలాను చంపినట్టే నిన్ను కూడా చంపుతామంటూ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు బెదిరింపు లేఖ వచ్చింది. సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ ను కూడా చంపేస్తామంటూ ఆ లేఖలో హెచ్చరించారు. ఈ లేఖను సీరియస్ గా తీసుకున్న సల్మాన్ ఖాన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. 

సల్మాన్ ఖాన్ గతంలో కృష్ణజింకలను వధించినట్టు ఆరోపణలు ఎదుర్కోవడం తెలిసిందే. సల్మాన్ పై నాడు బిష్ణోయ్ తెగవారు కోర్టును ఆశ్రయించారు. కృష్ణజింకలను బిష్ణోయ్ తెగ ప్రజలు ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఇప్పుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ కూడా ఈ బిష్ణోయ్ తెగకు చెందినవాడే. ఇతడు గతంలోనే సల్మాన్ ను చంపేస్తానంటూ బహిరంగంగా ప్రతిజ్ఞ చేశాడు. ఈ నేపథ్యంలో, సల్మాన్ కు తాజాగా బెదిరింపు లేఖ వెనుక లారెన్స్ ముఠా హస్తం ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Salman Khan
Threat
Letter
Sidhu Moosewala
Police

More Telugu News