Mahesh Babu: అల్లు అర్జున్ కు థాంక్స్ చెప్పిన మహేశ్ బాబు

Mahesh Babu thanked Allu Arjun
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగానూ మారి మేజర్ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో రిలీజైన మేజర్ చిత్రం ప్రతిచోట ప్రజాదరణ పొందుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్విట్టర్ లో స్పందించారు. 

ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన మహేశ్ బాబు పట్ల వ్యక్తిగతంగా ఎంతో గౌరవం కలుగుతోందని తెలిపారు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు హృదయాలను కదిలించే అనుభూతిని అందించినందుకు మహేశ్ బాబుకు శుభాభినందనలు తెలుపుతున్నానని అల్లు అర్జున్ వివరించారు. మేజర్ చిత్రం ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకుతుందని పేర్కొన్నారు. దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని బన్నీ అభినందించారు.

కాగా, అల్లు అర్జున్ తమ చిత్రం గురించి స్పందిచడంపై మహేశ్ బాబు హర్షం వ్యక్తం చేశారు. థాంక్యూ అల్లు అర్జున్ అంటూ ట్వీట్ చేశారు. మేజర్ సినిమాను రూపొందించిన యువ చిత్రబృందానికి మీ మాటలు నిజంగా ఎంతో ప్రోత్సాహాన్నిస్తాయని తెలిపారు. ఈ సినిమా బాగా నచ్చింది అని మీరు చెప్పడం సంతోషం కలిగిస్తోందని అని మహేశ్ బాబు పేర్కొన్నారు.
Go Back to Shorts
Mahesh Babu
Allu Arjun
Major
Movie

More Telugu News