మాల్దీవుల్లో రోహిత్, రితిక బీచ్ విల్లా అంత ఖరీదా.. విలాసవంతమైన ఆ విల్లా ఫీచర్లివే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాల్దీవుల్లో రోహిత్, రితిక బీచ్ విల్లా అంత ఖరీదా.. విలాసవంతమైన ఆ విల్లా ఫీచర్లివే!

Rohit and Ritika Pay Hefty For their Villa In Maldives currently in Holidays
  • మేధుఫారులోని సోనేవా జానీలో రోహిత్ జంట హాలీడే
  • సింగిల్ బెడ్రూం 5 స్టార్ విల్లాలో ఉంటున్న దంపతులు
  • ఒక్కో రాత్రికి రూ.2.65 లక్షల చార్జి
ఐపీఎల్ లో ముంబై కథ ముగిసిన వెంటనే ముంబై ఇండియన్స్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన కుటుంబంతో కలిసి మాల్దీవులకు హాలిడే కోసం వెళ్లిపోయాడు. అక్కడ తన కూతురు, భార్యతో క్వాలిటీ టైంను గడుపుతున్నాడు. అయితే, వాళ్లు ఉంటున్న విల్లానే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 

ప్రస్తుతం రోహిత్, రితికలు మాల్దీవుల్లోని మేధుఫారు దీవుల్లోని సోనేవా జానీ అనే 5 స్టార్ రిసార్ట్ లో ఉంటున్నారు. అక్కడ వాళ్లు ఉంటున్న విల్లా ఖరీదు ఒక్క రాత్రికి రూ.2.65 లక్షలు. విల్లాలో ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ తో పాటు రాత్రయితే ఆకాశంలోని నక్షత్రాలను చూసేందుకు వీలుగా పైకప్పును జరుపుకునే వీలుండడం ప్రత్యేకత. 

అక్కడ తీసుకునే బెడ్రూంలను బట్టి ఒక్క రాత్రికి విల్లా ఖరీదు రూ.1.74 లక్షల నుంచి రూ.18 లక్షల దాకా ఉంటుంది. జీక్యూ ఇండియా ప్రకారం రోహిత్ దంపతులు తీసుకున్నది సింగిల్ బెడ్రూం రిసార్టేనని తెలుస్తోంది. అక్కడ నీటిలోపల ఈత, సర్ఫింగ్, సముద్ర నీటి మీద సినిమా, సాయంత్రం వేళ డాల్ఫిన్ వీక్షణ, ప్రైవేట్ బీచ్ భోజనం వంటి సదుపాయాలను కల్పిస్తారు. 

ఇక్కడికి ఒక్క రోహిత్ శర్మ మాత్రమే కాదు.. పలువురు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులూ వస్తూపోతూ ఉంటారు. షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్, గ్వెనిత్ పాల్ట్రో, క్రిస్ మార్టిన్, డకోటా జాన్సన్ వంటి సెలబ్రిటీలకు ఇదే గమ్యస్థానమట. ఇక, సోనేవా జానీ చాప్టర్ 2లో విశాలవంతమైన లివింగ్ స్పేస్ (హాల్) ఉంటుందట. అంతేకాదు.. ప్రైవేటు స్పాలు, నట్టడవుల్లో గార్డెన్లు దాని ప్రత్యేకత. బీచ్ వైబ్స్, అక్కడ ఉండే వెలుతురుకు తగినట్టు విల్లా ఇంటీరియర్ ను తెలుపు, లేలేత రంగులతోనే అందంగా తీర్చిదిద్దుతారట.
Rohit Sharma
Ritika Sajdeh
Cricket
Maldives

More Telugu News