డీజీపీ గారు అపాయింట్ మెంట్ ఇచ్చేలా లేరు... కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తాం: పవన్ కల్యాణ్
- కోనసీమ అల్లర్లపై పవన్ ప్రెస్ మీట్
- డీజీపీకి కూడా బాధ్యత ఉంటుందన్న పవన్
- ఆత్మసాక్షితో వ్యవహరించాలని హితవు
- కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు పట్టించుకోలేదని ఆరోపణ
కాగా, తాము డీజీపీని కలవాలనుకున్నామని, కానీ ఆయన తమకు అపాయింట్ మెంట్ ఇచ్చే మైండ్ సెట్ తో లేరన్న విషయం అర్థమైందని పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల వరకు చూస్తామని, అప్పటికీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
డీజీపీ తన బాధ్యత తాను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఆత్మసాక్షి అనేది ఒకటుంటుందని ఉద్ఘాటించారు. బాధ్యత ఉన్న ఎవరూ గొడవలు కోరుకోరని, సమాజంలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్లే బాధ్యతల నుంచి తప్పించుకుంటే ఎలా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.