సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు
- నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్య
- ఈ వ్యవహారంపై సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు
- గతంలో పాటియాలా హౌజ్ కోర్టుకు హాజరైన సోనియా, రాహుల్
నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిచింది. ప్రస్తుతం ఈ పత్రికను పార్టీ మూసేసింది. అయితే ఈ సంస్థకు దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ఇతర ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో వేసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ.
ఈ వ్యవహారంపై గతంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... తమ జీవిత కాలంలోనే తొలిసారి సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఇదే వ్యవహారంలో వారిద్దరికీ ఈడీ సమన్లు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.