తనకు భద్రత కల్పించాలంటూ తెరపైకి వచ్చిన పంజాబీ గాయకుడు మన్ కీర్త్ ఔలాక్
- పంజాబ్ లో సింగర్ మూసేవాలా హత్య
- తీవ్ర భయాందోళనలో గాయకుడు మన్ కీర్త్ ఔలాక్
- ఏప్రిల్ లో బెదిరింపులు వచ్చాయని వెల్లడి
పంజాబ్ లో ప్రధానంగా లారెన్స్ బిష్ణోయ్, దేవిందర్ బంభియా ముఠాల మధ్య గ్యాంగ్ వార్ లో మూసేవాలా వంటి వారు బలవుతున్నట్టు భావిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ జైలుకు వెళ్లడంతో, గోల్డీ బ్రార్ ఆ ముఠా బాధ్యతలు చూస్తున్నాడు. మూసేవాలా హత్యకు తానే బాధ్యుడ్ని అంటూ గోల్డీ బ్రార్ ఫేస్ బుక్ లో ప్రకటించుకోవడం తెలిసిందే. గ్యాంగ్ స్టర్ వికీ మిద్దుఖేరా మృతికి ప్రతీకారంగానే సిద్ధూ మూసేవాలాను చంపినట్టు గోల్డీ బ్రార్ పేర్కొన్నాడు.