కోస్తాపై భానుడి భగభగలు.. ఎండల తీవ్రతకు అల్లాడిపోతున్న జనం

  • 21 మండలాల్లో వీచిన వడగాలులు 
  • నేడు కూడా రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్న అధికారులు
  • అప్రమత్తంగా ఉండాలని సూచన
  • కోస్తా, రాయలసీమల్లో నేడు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌పై భానుడు పగబట్టినట్టుగా ఉంది. రాష్ట్రంపై నిప్పుల వాన కురిపిస్తున్న సూరీడు ప్రజలను అల్లాడిస్తున్నాడు. నిన్న ఎండ తీవ్రత అమాంతం పెరగడంతో పాటు వడగాలులు కూడా జనాన్ని ఇబ్బంది  పెట్టాయి. దీంతో ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే ప్రజలు భయపడ్డారు. వడగాలుల తీవ్రతకు చాలా చోట్ల ప్రజలు సొమ్మసిల్లి పడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 21 మండలాల్లో నిన్న వడగాలులు వీచినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

తణుకు, తాడేపల్లిగూడెం, ఇబ్రహీంపట్నం, ఉండ్రాజవరంలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 84 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కోస్తా, రాయలసీమల్లో నేడు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Coastal Andhrapradesh
Rayalaseema
Heat Waves
Rains

More Telugu News