నా గుండె బద్దలయింది: టెన్నిస్ స్టార్ జకోవిచ్
- దివాలా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బోరిస్ బెకర్
- బెకర్ ను ఇలా చూడటం చాలా బాధగా ఉందన్న జకోవిచ్
- బెకర్ కొడుకు నోవాతో టచ్ లో ఉన్నానని వెల్లడి
తనకు, తన కుటుంబానికి బెకర్ ఎంతో ఆప్తుడని జకోవిచ్ అన్నాడు. కొన్నేళ్ల పాటు ఇద్దరం కలిసి ఎంతో గొప్ప సమయాన్ని గడిపామని చెప్పాడు. జకోవిచ్ కు 2013 నుంచి 2017 వరకు బెకర్ హెడ్ కోచ్ గా వ్యవహరించిన సంగతి గమనార్హం. బెకర్ కుమారుల్లో ఒకడైన నోవాతో తాను టచ్ లో ఉన్నానని... ఏదైనా సాయం కావాల్సి వస్తే తాను చేస్తానని చెప్పానని జొకోవిచ్ తెలిపాడు.
వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడాలని భావిస్తున్నట్టు జకోవిచ్ చెప్పాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో జకోవిచ్ ఆడని సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోవడంతో ఆయనను ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆడనివ్వలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ... తనను ఆడనివ్వకపోవడం పట్ల తనకు ఎలాంటి కోపం లేదని చెప్పాడు.