Balakrishna: కార్య‌క‌ర్త‌ల‌కు క‌ష్ట‌మొస్తే అర్ధరాత్రి అయినా వ‌స్తా!: హిందూపురంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌

tdp mla nandamuri balakrishna tour in hindupuram
షార్ట్స్‌లో చూడండి
ఓ వైపు టీడీపీ మ‌హానాడు ఒంగోలులో జ‌రుగుతుంటే... ఆ పార్టీ కీల‌క నేత‌, ప్ర‌ముఖ సినీ న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ శుక్ర‌వారం త‌న సొంత నియోజ‌కవ‌ర్గం హిందూపురం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని చిల‌మ‌త్తూరు మండ‌లం కొడికిండ గ్రామానికి చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. 

రెండు రోజుల క్రితం వైసీపీ శ్రేణుల దాడిలో గ్రామానికి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు న‌ర‌సింహ‌మూర్తి, ర‌విలు గాయ‌ప‌డ్డారు. స్థానిక టీడీపీ నేత‌ల ద్వారా ఈ విష‌యం తెలుసుకున్న బాల‌కృష్ణ‌...వారిని ప‌రామ‌ర్శించే నిమిత్త‌మే హిందూపు‌రం వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా గాయ‌ప‌డ్డ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇచ్చిన బాల‌కృష్ణ‌... త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే ఖ‌బడ్దార్ అంటూ వైసీపీ శ్రేణుల‌ను హెచ్చ‌రించారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు క‌ష్ట‌మొస్తే అర్ధరాత్రి అయినా తాను వ‌స్తాన‌ని బాల‌కృష్ణ చెప్పారు.
Go Back to Shorts
Balakrishna
TDP Mahanadu
TDP
Hindupuram
YSRCP

More Telugu News