పాకిస్థాన్ లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ ఆవేదన!
- లాహోర్ బంకుల్లో పెట్రోల్, ఏటీఎంలో డబ్బులు లేవంటూ హఫీజ్ ఆగ్రహం
- రాజకీయ నాయకుల వల్ల ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్న
- పాక్ తరపున 12 వేల పరుగులు చేసిన హఫీజ్
లాహోర్ లోని బంకుల్లో పెట్రోల్ లేదని, ఏటీఎంలలో నగదు లేదని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నాడు. రాజకీయ నాయకుల నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించాడు. ఈ ట్వీట్ ను ప్రధాని హెహబాజ్ షరీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లతో పాటు పలువురు రాజకీయ నేతలను ట్యాగ్ చేశాడు.
మొహమ్మద్ హఫీజ్ పాకిస్థాన్ తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. అంతేకాదు, పాక్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 12 వేల పరుగులను చేయడంతో పాటు, 250 వికెట్లు తీశాడు.