జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు!

vehucles speed limit hike in ghmc
  • ప్ర‌స్తుతం అన్ని వాహ‌నాల వేగం గంట‌కు 40 కిలో మీటర్లు
  • తాజాగా వాహ‌నాలు, ఆయా రోడ్ల‌పై వేగ ప‌రిమితి వేర్వేరుగా ప్ర‌క‌ట‌న‌
  • అత్య‌ధిక వేగంగా కార్ల‌కు గంట‌కు 60 కిలో మీట‌ర్లు
  • కాల‌నీల్లో అన్ని వాహ‌నాల వేగం గంట‌కు 30 కిలో మీట‌ర్లు
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితిని పెంచుతూ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ కార్యాల‌యం బుధ‌వారం నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టిదాకా జీహెచ్ఎంసీ ప‌రిధిలో అన్ని ర‌కాల వాహ‌నాల వేగ ప‌రిమితి గంట‌కు 40 కిలో మీట‌ర్లుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వేగాన్ని మించితే ట్రాఫిక్ పోలీసులు జ‌రిమానా విధిస్తున్నారు. అయితే తాజాగా ఈ వేగ ప‌రిమితిని పెంచ‌డంతో పాటుగా ఆయా వాహ‌నాల వేగ ప‌రిమితుల‌ను వేర్వేరుగా నిర్ణ‌యించారు. 

డివైడ‌ర్లు ఉన్న చోట (డ‌బుల్ లేన్‌) కార్లు గంట‌కు 60 కిలో మీట‌ర్ల వేగంతో వెళ్లేందుకు అనుమ‌తించిన పోలీసు శాఖ‌... ఆ ప్రాంతాల్లో బ‌స్సులు, బైకుల స్పీడును మాత్రం గంట‌కు 50 కీలో మీట‌ర్లుగా నిర్ణయించింది. ఇక న‌గ‌ర ప‌రిధిలో డివైడ‌ర్లు లేని చోట కార్ల వేగాన్ని గంట‌కు 50 కీలో మీట‌ర్లు కాగా... బ‌స్సులు, బైకుల వేగం మాత్రం గంట‌కు 40 కీలో మీట‌ర్లుగా ఉంది. ఇక కాల‌నీల్లో అన్ని ర‌కాల వాహ‌నాల వేగం 30 కిలో మీట‌ర్ల‌కు మించ‌రాద‌ని పోలీసు శాఖ ప్ర‌క‌టించింది.
GHMC
Hyderabad Police
Speed Limit

More Telugu News