కోనసీమ జిల్లా పేరు మార్పు... అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి!
- కోనసీమ పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చిన ప్రభుత్వం
- పాత పేరే ఉంచాలని ఆందోళన చేస్తున్న ఓ వర్గం వారు
- ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొందరు యువకులు తప్పించుకుని కలెక్టరేట్ వద్దకు పరుగులు తీశారు. వీరిని పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో అమలాపురం ఏరియా ఆసుపత్రి వద్ద పోలీసులపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు.
ఈ దాడిలో పోలీసులకు, యువకులకు ఇరువర్గాలకు గాయాలయ్యాయి. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో రాళ్ల దాడి నుంచి తప్పించుకున్నారు. ఆందోళనకారులు ఎస్పీ వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.