తెలంగాణలో తాజాగా 27 మందికి కరోనా పాజిటివ్

Telangana covid update
  • గత 24 గంటల్లో 12,017 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 17 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 52 మంది
  • ఇంకా 372 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 12,017 శాంపిల్స్ పరీక్షించగా, 27 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 17 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 4, హనుమకొండ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 1, జగిత్యాల జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1 కేసు గుర్తించారు. 

అదే సమయంలో 52 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇక తెలంగాణలో ఇప్పటిదాకా 7,92,898 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,415 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 372 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
Go Back to Shorts
Telangana
COVID19
Update
Media Bulletin

More Telugu News