Rajasekhar: 'శేఖర్' సినిమాపై స్టే ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది: రాజశేఖర్

Rajasekhar statement on Sekhar movi issue
  • ఆర్థిక వివాదంలో 'శేఖర్' చిత్రం
  • కోర్టును ఆశ్రయించిన ఫైనాన్షియర్
  • సినిమా ప్రదర్శనలు నిలిపివేత
  • స్టే తొలగిపోయిందన్న రాజశేఖర్

యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించిన 'శేఖర్' చిత్రం ఇటీవల రిలీజైంది. అయితే, ఈ చిత్ర దర్శకురాలు జీవిత తమకు అప్పుగా చెల్లించాల్సిన డబ్బు ఇవ్వలేదంటూ ఫైనాన్షియర్ కోర్టుకెక్కారు. దాంతో కోర్టు డబ్బు చెల్లించేందుకు జీవితకు సమయం ఇచ్చింది. జీవిత నిర్దేశిత సమయంలో డబ్బు చెల్లించకపోవడంతో 'శేఖర్' చిత్ర ప్రదర్శనలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఉత్తర్వులను కోర్టు కొట్టివేసిందని హీరో రాజశేఖర్ వెల్లడించారు. అది తప్పుడు కేసు అని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని కోర్టు గుర్తించిందని, 'శేఖర్' సినిమాపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొట్టివేసిందని తెలిపారు. 

ఏదేమైనా వీకెండ్ లో 'శేఖర్' చిత్రప్రదర్శనలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడిందని రాజశేఖర్ వివరించారు. అయితే, శేఖర్ చిత్రం తగిన రీతిలో ప్రజాదరణకు నోచుకుంటుందని తాను ముందే చెప్పానని తెలిపారు. భవిష్యత్ లో 'శేఖర్' చిత్ర ప్రదర్శనపై నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారికి తాము మద్దతుగా నిలుస్తామని రాజశేఖర్ వెల్లడించారు. తమ వెన్నంటే ఉన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వివరించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News