మెహ్రీన్ కి ఇప్పుడు హిట్టు చాలా అవసరం!
- గ్లామరస్ హీరోయిన్ గా మెహ్రీన్ కి క్రేజ్
- కెరియర్ ఆరంభంలో పడిన వరుస హిట్లు
- పెళ్లి ఆలోచనతో అవకాశాలను పక్కన పెట్టిన మెహ్రీన్
- కొన్ని కారణాల వలన ఆమె నిర్ణయంలో మార్పు
- ఇప్పుడిక పూర్తి స్థాయిలో కెరియర్ పైనే దృష్టి
ఆ తరువాత వరుస పరాజయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, 'ఎఫ్ 2' హిట్ ఆమెకి ఊరటనిచ్చింది. ఆ సినిమా తరువాత ఆమె తన కెరియర్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. పెళ్లి చేసుకుని వెళ్లిపోవాలనే ఉద్దేశంతో కొత్త ప్రాజెక్టుల కోసం ప్రయత్నించలేదు. దాంతో ఆమె కోసం అనుకున్న పాత్రలు వేరేవారికి వెళ్లిపోయాయి.
అయితే కొన్ని కారణాల వలన మెహ్రీన్ పెళ్లి విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. మంచి సంబంధం సెట్ అయ్యేంత వరకూ ఇండస్ట్రీలో కొనసాగాలని భావించింది. అందులో భాగంగానే ఆమె మారుతిని రిక్వెస్ట్ చేసి మరీ ఓ చిన్న సినిమా చేసింది. ఆ సమయంలోనే ఆమెకి 'ఎఫ్ 3' సినిమా ఊతమిచ్చినట్టు అయింది. ఇప్పుడు ఈ సినిమా హిట్ కోసం అందరికంటే ఆమెనే ఎక్కువగా వెయిట్ చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ ఆమె కెరియర్ కి అంత అవసరం మరి.