రైలెక్కిన బస్సులు... వీడియో ఇదిగో!
- గూడ్స్ రైళ్లలో బస్సుల రవాణా
- బెంగళూరు నుంచి చండీగఢ్ కు 300 బస్సుల తరలింపు
- అశోక్ లేలాండ్ ప్లాంట్లలో తయారైన బస్సులు
- బస్సులను కొనుగోలు చేసిన హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ
- రైల్లో చవకగా రవాణా
ఈ బస్సులు బెంగళూరు, హోసూరులోని అశోక్ లేలాండ్ యూనిట్లలో తయారయ్యాయి. వీటిని రోడ్డు మార్గంలో తరలించాలంటే ఎంతో వ్యయం అవుతుంది. దేశంలో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రైలు మార్గం ద్వారా చాలా చవకగా రవాణా చేయవచ్చని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన వందలాది బస్సులను రైల్లో తరలించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ లో పంచుకున్నారు.