రష్యాతో జరుగుతున్న యుద్ధంలో విజయం మాదే: జెలెన్ స్కీ

Will win the war says Zelensky
  • సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుందన్న జెలెన్ స్కీ 
  • అయితే ఇది అంత సాధారణ విషయం కాదని కామెంట్ 
  • యుద్ధంలో రక్తపాతం తప్పదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు 
ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడుతున్నప్పటికీ ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొంటోంది. రష్యా బలగాలకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తోంది. మరోవైపు రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమవుతున్నాయి. యుద్ధం ప్రారంభమయి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ ఎవరూ ఎవరిపై పైచేయి సాధించలేక పోయారు. యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాట్లాడుతూ... ఈ యుద్ధంలో తాము విజయం సాధిస్తామని చెప్పారు. సరైన దౌత్యంతోనే యుద్ధం ముగుస్తుందని అన్నారు. యుద్ధంలో రక్తపాతం తప్పదని అన్నారు. యుద్ధం కొనసాగుతుందని... చివరకు దౌత్య మార్గాల ద్వారానే యుద్ధం అంతమవుతుందని చెప్పారు. అయితే రెండు దేశాలు పట్టు వీడకపోవడం వల్ల.. ఇది అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదని అన్నారు.
Go Back to Shorts
Zelensky
Ukraine
Russia
War

More Telugu News