తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలి: ప‌వ‌న్ క‌ల్యాణ్

pawan visits nalgonda
  • ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ పర్యటన‌
  • ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ‌
  • తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించార‌న్న ప‌వ‌న్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉమ్మడి న‌ల్ల‌గొండ‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించి, ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ కల్యాణ్ మాట్లాడుతూ... తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించార‌ని ఆయ‌న చెప్పారు. 

తెలంగాణలో జ‌న‌సేన‌ పార్టీ పటిష్ఠ‌త కోసం కృషి చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు. చౌటుప్పల్ లో ప‌ర్య‌టన ముగించుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కోదాడకు బయలు దేరారు. కోదాడలో గత ఏడాది ఆగస్టు 20న బక్కమంతులగూడెం స‌మీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రామ‌ర్శిస్తారు. 

            
                 
                              
కాగా, న‌ల్ల‌గొండకు బ‌య‌లుదేరే ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద, సికింద్రాబాద్, మెట్టుగూడ, ఎల్బీ నగర్ వ‌ద్ద ఆగుతూ అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా మెట్టుగూడ వ‌ద్ద ప‌వ‌న్ క‌ల్యాణ్ కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Nalgonda District

More Telugu News