తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలి: పవన్ కల్యాణ్
- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
- ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ
- తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారన్న పవన్
తెలంగాణలో జనసేన పార్టీ పటిష్ఠత కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. చౌటుప్పల్ లో పర్యటన ముగించుకున్న పవన్ కల్యాణ్ కోదాడకు బయలు దేరారు. కోదాడలో గత ఏడాది ఆగస్టు 20న బక్కమంతులగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కడియం శ్రీనివాస్ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు.

కాగా, నల్లగొండకు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద, సికింద్రాబాద్, మెట్టుగూడ, ఎల్బీ నగర్ వద్ద ఆగుతూ అభిమానులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మెట్టుగూడ వద్ద పవన్ కల్యాణ్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు.