స్టాలిన్ ఇంటిని బాంబులతో పేల్చి వేస్తామంటూ బెదిరింపులు!
- బుధవారంనాడు బెదిరింపు కాల్స్ చేసిన తిరునల్వేలి జిల్లాకు చెందిన వ్యక్తి
- సైబర్ క్రైమ్ విభాగం సాయంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- గంజాయి మత్తులో ఫోన్ చేసినట్టు విచారణలో తేలిన వైనం
ఆ తర్వాత ఫోన్ చేసిన ఆగంతుకుడు ఎవరనే విషయంపై దృష్టి సారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ విభాగంతో కలసి నిందితుడిని పోలీసులు గుర్తించారు. తిరునల్వేలి జిల్లా సుద్దమిల్లి గ్రామానికి చెందిన తామరైకన్నన్ ఈ ఫోన్ చేసినట్టు నిర్ధారించి, అరెస్ట్ చేశారు. గంజాయి మత్తులో అతను ఈ ఫోన్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.