ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20న పవన్ కల్యాణ్ పర్యటన
- మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్న జనసేనాని
- ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం
- పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పార్టీ నుంచి ప్రకటన
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం అందిస్తారని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. 20వ తేదీన పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో బయల్దేరి.. మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామం చేరుకుంటారు. అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి బయల్దేరి కోదాడకు వెళ్లి, కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పవన్ పరామర్శిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.