IPL 2022: కేకేఆర్‌తో మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో జ‌ట్టు

lsg wins the toss and choose to bat first
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ తాజా సీజ‌న్ లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా బుధ‌వారం రాత్రి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టుతో కొత్త జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ల‌ప‌డ‌నుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ల‌క్నో జ‌ట్టు ఫ‌స్ట్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. కోల్‌క‌తా జ‌ట్టుకు ఛేజింగ్ అవ‌కాశం ఇచ్చింది. 

ఇప్ప‌టిదాకా 13 మ్యాచ్‌లు ఆడిన ఇరు జ‌ట్లు... అధిక విజ‌యాల‌తో కోల్‌క‌తా కంటే ల‌క్నోనే టాప్ పొజిష‌న్‌లో ఉంది. మొత్తం 13 మ్యాచ్‌ల‌కు గాను 8 విజ‌యాల‌తో 16 పాయింట్లు సాధించిన ల‌క్నో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో ఉంది. అదే స‌మ‌యంలో 13 మ్యాచ్‌ల‌లో 6 విజ‌యాల‌తో 12 పాయింట్లు సాధించిన కోల్‌క‌తా జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో 6వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం ద్వారా లక్నో ప్లే ఆఫ్స్ బెర్తును ఖ‌రారు చేసుకోనుండ‌గా... కోల్ క‌తా విజ‌యం సాధిస్తే ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను మెరుగుప‌ర‌చుకోనుంది.
Go Back to Shorts
IPL 2022
Lucknow Super Giants
Kolkata Knight Riders

More Telugu News