Ramcharan: చరణ్ .. శంకర్ సినిమా విషయంలో ప్లాన్ మార్చేసిన దిల్ రాజు!

shankar and Charan movie update
షార్ట్స్‌లో చూడండి
చరణ్ .. శంకర్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. కెరియర్ పరంగా ఇది చరణ్ కి 15వ సినిమా. ఇప్పటికే ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా వైజాగ్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఆ తరువాత షెడ్యూల్స్ ను హైదరాబాద్ .. మారేడుమిల్లిలో ప్లాన్ చేశారు.

ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన బ్యానర్ పై నిర్మితమవుతున్న 50వ సినిమా ఇది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అయితే ఈ సినిమా షూటింగు పార్టు ఇంకా  చాలానే మిగిలి ఉంది. అందువలన ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చాడని అంటున్నారు. 

ఇక మరోపక్క, ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలనే ఆలోచనకి దిల్ రాజు వచ్చాడని చెబుతున్నారు. ఇందులో విజయ్ జోడీగా రష్మిక అలరిస్తుందనే సంగతి తెలిసిందే. 
       

 

Go Back to Shorts
Ramcharan
Shankar
Dil Raju

More Telugu News