పెట్టుబడులే లక్ష్యంగా.. పది రోజుల విదేశీ పర్యటనకు కేటీఆర్
- నేడు శంషాబాద్ నుంచి లండన్‌కు కేటీఆర్
- అక్కడ వివిధ కంపెనీల అధినేతలు, సీఈవోలతో భేటీ
- 22 నుంచి దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు
- 26న తిరిగి హైదరాబాద్‌కు..
అనంతరం అక్కడి నుంచి స్విట్జర్లాండ్ చేరుకుంటారు. దావోస్‌లో ఈ నెల 22 నుంచి 26 వరకు జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి పాల్గొంటారు. ఆ సదస్సుకు హాజరయ్యే పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల అధినేతలు, సీఈవోలతో భేటీ అవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించి రాష్ట్రానికి ఆహ్వానిస్తారు. అనంతరం ఈ నెల 26న తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.