ఢిల్లీకి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి... ఎందుకోసమంటే..!
- కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు
- 2, 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న మాజీ సీఎం
- సోనియా, రాహుల్, కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశం
- ఏపీలో పార్టీ పటిష్ఠతపై చర్చించే ఛాన్స్
ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో పాటు పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నట్లు సమాచారం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి సంబంధించి ఆయనతో పార్టీ అధిష్ఠానం చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.