ప్రభాస్ జోడీగా చేయడానికి ఓకే చెప్పిన అనుష్క?
- ప్రభాస్ - అనుష్క జోడీకి మంచి క్రేజ్
- 'బాహుబలి 2' తరువాత తెరపై కనిపించని జంట
- 'నిశ్శబ్దం' తరువాత సినిమాలు చేయని అనుష్క
- ప్రభాస్ 'రాజా డీలక్స్' కోసం ఆమెను మారుతి ఒప్పించాడంటూ టాక్
అలాంటి అభిమానుల కోరిక త్వరలో నెరవేరనుందని తెలుస్తోంది. 'నిశ్శబ్దం' తరువాత అనుష్క మరో సినిమా చేయలేదు. ఒక సినిమా ఏదో ఒప్పుకుందని అన్నారుగానీ అందుకు సంబంధించిన అప్ డేట్స్ లేవు. ఈ నేపథ్యంలో ఆమెను దర్శకుడు మారుతి ఒప్పించినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే టాక్ నడుస్తోంది.
దర్శకుడు మారుతి .. ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాయిక అనుష్క అయితే ఈ ప్రాజెక్టుకు మరింత ప్లస్ అవుతుందని భావించిన ఆయన, ఆమెను ఒప్పించినట్టుగా తెలుస్తోంది. మొదట్లో ఇది పుకారు మాత్రమే అనుకున్నా, ఇది నిజమే అనే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో బలంగానే వినిపిస్తోంది. మారుతి ఏం చెబుతాడో చూడాలి మరి.