ప్రభాస్ జోడీగా చేయడానికి ఓకే చెప్పిన అనుష్క?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ జోడీగా చేయడానికి ఓకే చెప్పిన అనుష్క?

Maruthi movies update
  • ప్రభాస్ - అనుష్క జోడీకి మంచి క్రేజ్ 
  • 'బాహుబలి 2' తరువాత తెరపై కనిపించని జంట 
  • 'నిశ్శబ్దం' తరువాత సినిమాలు  చేయని అనుష్క 
  • ప్రభాస్  'రాజా డీలక్స్' కోసం ఆమెను మారుతి ఒప్పించాడంటూ టాక్
ప్రభాస్ - అనుష్క కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరినీ తెరపై చూసిన ఆడియన్స్ 'జోడీ' అంటే ఇదే అనుకున్నారు. అందుకు తగినట్టుగానే ఆ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. 'బాహుబలి 2' తరువాత ఈ జంట తెరపై మళ్లీ కనిపించలేదు. ఈ జంటను మళ్లీ తెరపై చూడటానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపుతున్నారు. 

అలాంటి అభిమానుల కోరిక త్వరలో నెరవేరనుందని తెలుస్తోంది. 'నిశ్శబ్దం' తరువాత అనుష్క మరో సినిమా చేయలేదు. ఒక సినిమా ఏదో ఒప్పుకుందని అన్నారుగానీ అందుకు సంబంధించిన అప్ డేట్స్ లేవు. ఈ నేపథ్యంలో ఆమెను దర్శకుడు మారుతి ఒప్పించినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే టాక్ నడుస్తోంది.  

దర్శకుడు మారుతి .. ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాయిక అనుష్క అయితే ఈ ప్రాజెక్టుకు మరింత ప్లస్ అవుతుందని భావించిన ఆయన, ఆమెను ఒప్పించినట్టుగా తెలుస్తోంది. మొదట్లో ఇది పుకారు మాత్రమే అనుకున్నా, ఇది నిజమే అనే మాట ఇప్పుడు ఇండస్ట్రీలో బలంగానే వినిపిస్తోంది. మారుతి ఏం చెబుతాడో చూడాలి మరి.
Prabhas
Anushka Shetty
Maruthi Movie

More Telugu News