Virat Kohli: కోహ్లీపై పంజాబ్ పెట్టిన ఈ పోస్ట్ తెగ వైరల్!

This Punjab Kings Post On Kohli Wins Hearts
విరాట్ కోహ్లీకి ఈ సీజన్ ఐపీఎల్ ఎంతటి పీడకలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. ఫామ్ ను అందుకోలేక నానా తంటాలు పడుతున్నాడు. మొన్నటి పంజాబ్ మ్యాచ్ లో టచ్ లోకి వచ్చినట్టే కనిపించినా అంతలోనే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ‘దేవుడా’ అంటూ బ్యాట్ ను పైకెత్తి ఆకాశంలోకి చూడడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడతను. 

అయితే, ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయినా.. ఆ మ్యాచ్ లో పంజాబ్ గెలిచినా.. క్రీడా స్ఫూర్తి పరంగా పంజాబ్ కింగ్స్ అల్లంత ఎత్తులో నిలిచింది. అవును, కోహ్లీపై ఆ జట్టు యాజమాన్యం ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టే అందుకు ఉదాహరణ.  

‘‘కోహ్లీ.. నువ్వున్నంతసేపూ నీ బ్యాటింగ్ ను మేమూ ఆస్వాదించాం. త్వరలోనే నీకు అదృష్టం కలిసి రావాలని కోరుకుంటున్నాం’’ అంటూ పంజాబ్ కింగ్స్ కామెంట్ చేసింది. ఈ పోస్ట్ కు క్రికెట్ అభిమానులు ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. పోస్ట్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామంటూ వ్యాఖ్యానించారు. 

‘‘నాకు పంజాబ్ గెలవాలని ఉంది. కానీ, కోహ్లీ అభిమానిగా అతడు ఫెయిలవడం చూస్తుంటేనే బాధగా ఉంది. తర్వాతి మ్యాచ్ లలోనైనా ప్రత్యేకించి వరల్డ్ కప్ లోనైనా అతడికి అదృష్టం కలసి రావాలని కోరుతున్నా’’ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘ఎంత బాగా చెప్పారో. త్వరలోనే కోహ్లీ ఫామ్ లోకి రావాలి’’ అని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఆర్సీబీ అభిమానినే అయినా పంజాబ్ అందరి మనసులను గెలిచిందంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. కాగా, ఈ పోస్ట్ కు ఇప్పటిదాకా 2.05 లక్షల మంది లైక్ కొట్టారు.
Virat Kohli
Cricket
Punjab
IPL

More Telugu News